Monday, December 23, 2024

‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

'Ramarao On Duty' to released on June 17th

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శరత్ మండవ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి, ఆర్‌టి టీమ్ వర్క్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మేకర్స్ రవితేజ తీక్షణంగా చూస్తోన్న లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళ్తుండడాన్ని ఆయన గమనిస్తున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

‘Ramarao On Duty’ to released on June 17th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News