Monday, December 23, 2024

రాముడి పాలన ఆదర్శం

- Advertisement -
- Advertisement -

అధికారులకు ప్రధాని మోడీ పిలుపు

ఎపిలోని శ్రీసత్యసాయి జిల్లాలో నాసిన్‌కు ప్రారంభోత్సవం

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు ఇదే రామరాజ్యం సందేశం
ఏపి నాసిన్ ప్రారంభ వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ

మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాల్లో పన్నుల విధానం ప్రజలకు అర్ధమయ్యేది కాదని ..జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామని..ప్రజల నుంచి వచ్చిన పన్నులను వారి సంక్షేమం కోసమే వాడాలని అదే రామరాజ్యం ఇచ్చిన సందేశం అని ప్రధాని నరేంద్రమోడి అన్నా రు. కేంద్ర ప్రభుత్వం రామరాజ్యం పాలనను అందించే విధంగా పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అధికారులు రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా లో నెలకొల్పిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ ప్రసంగంలో రాముడి పాలనను ఉదాహరించారు.

రానున్న రోజుల్లో నాసిన్ కేం ద్రం ప్రముఖ శిక్షణా సంస్థగా మారుతుందని. సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందని స్పష్టం చేశారు.చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. నాసిన్ ప్రారంభం తనకు ఆనందం గా ఉందన్నారు. రామరాజ్యంలో అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీజీ అన్నారని ప్రధాని మోడీ గుర్తుచేశారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ సరళంగా ఉండేదని, సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులను సరళీకృతం చేయడంవల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు లక్షల కోట్ల రూపాయలు లాభం జరిగిందని వివరించారు. తాము తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల పన్నులు చెల్లించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందని పేర్కొన్నారు. పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందని, అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని మోడీ అన్నారు.జిఎస్‌టి రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని వివరించారు. ప న్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని, వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపా రు. పేదలు, రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. పేదలకు ప్రభుత్వాలు సహకారమందిస్తే పేదరికం దూరమవుతుందని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధా ని వెల్లడించారు.పేదల జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతి ఆయోగ్ చెప్పిందని, వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచస్థాయి సంస్థగా నాసిన్: సిఎం జగన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపి సిఎం వైఎస్ జగన్మొహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏపికి నాసిన్ వంటి ప్రపంచస్థాయి సం స్థ రావడం గర్వంగా ఉందన్నారు. నాసిన్‌తో ఏపి కి ప్రపంచస్థాయి గుర్తింపు రానుందన్నారు. ఏపి పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందన్నారు. ప్రధాని మోడీకి కృతజ్ణతలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యతో రూ.720 కోట్లు ఖర్చు చేసి నాసిన్ నిర్మించామని, నాసిన్ సంస్థ ఏర్పాటుకు సహకారం అందించిన జగన్‌ను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తోపాటు పలువురు రాష్ట్రమంత్రలు ఎంపిలు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధాని తన పర్యటనలో లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News