Thursday, January 23, 2025

చాన్నాళ్ల విరామం తరువాత రాంబో సర్కస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇరవై ఏండ్ల విరామం తరువాత ప్రఖ్యాత రాంబో సర్కస్ తిరిగి ఢిల్లీలో ప్రదర్శనకు వచ్చింది. సినిమాలు ఇప్పుడు సెల్‌ఫోన్లలో హంగామాలు దశలో సర్కస్ షోలు వెలవెలపోతూ వచ్చాయి. అయితే పలు రకాల ఉత్కంఠతల బిగ్ షోగా సర్కస్ తిరుగులేని పేరు తెచ్చుకుంది. దేశ రాజధానిలోని ఫోర్ట్ ఆడిటోరియంలో రోజుకు మూడు ఆటలుగా ఈ సర్కస్‌ను తీసుకువచ్చినట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రజల ప్రత్యేకించి యువత ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా ఎన్నో ఆకర్షణలతో ఈ రాంబో సర్కస్‌ను తిరిగి తీసుకువచ్చినట్లు వివరించారు.

ఇంతకు ముందు సర్కస్ టీం కనీసం 200 మంది వరకూ ఉండేది. దీనిని ఇప్పుడు 60కి కుదించారు. ఒక్కో షో గంటన్నర నిడివిలో ఉంటుంది. ఇందులో 22 వరకూ వివిధ విన్యాసాలు అలరిస్తాయి. జంతువుల సంబంధిత విన్యాసాలకు బదులుగా ఎక్కువగా గాలిలో విన్యాసాలు, కత్తిసాములు , గారడీలు , జగ్లరీలు ఉంటాయని తెలిపారు. ఇక సర్కస్‌కు ఆకర్షణగా నిలిచే జోకర్ల ప్రకియలో భాగంగా ఆరుగురు పలు హాస్య ప్రదర్శనలకు దిగుతారు. ప్రత్యేకించి లేడీస్ ఏరోబిక్స్ అందరిని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News