Thursday, January 23, 2025

సిద్దిపేటకు, తెలంగాణ ప్రాంతానికి రాంచంద్రారెడ్డి చేసిన సేవలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేటకు, తెలంగాణ ప్రాంతానికి రాంచంద్రారెడ్డి చేసిన సేవలు మరువలేనివని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్‌లోని నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన మాజీ రాజ్యసభ దివంగత సోలిపేట రామచంద్రారెడ్డి సంస్మరణ సభకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు.

సర్పంచ్ స్థ్ధాయి నుంచి రాజ్యసభ వరకు అన్ని హోదాల్లో హుందాగా పని చేశారన్నారు. సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రైతులకు చేసిన సేవలు మర్చి పోలేమన్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన నాయకుడు రామచంద్రారెడ్డి అన్నారు. వారు పుస్తకాలు చదవడమే కాకుండా ప్రతి విషయాన్ని అధ్యయనం చేసి వచ్చిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలనే సహృదయంతో ఉండేవారన్నారు.

సిఎం కెసిఆర్ రామచంద్రారెడ్డి చనిపోవడం తెలుసుకొని చాలా బాధపడ్డారని, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని చింతించారని తెలిపారు. సోలిపేట రామచంద్రారెడ్డి విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు ఎక్కడ స్థాపించాలని కోరుకుంటారో అక్కడే స్థాపించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News