Monday, December 23, 2024

రాంచంద్రం మృతి బిఆర్‌ఎస్‌కి తీరనిలోటు

- Advertisement -
- Advertisement -
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

కోహెడ: బిఆర్‌ఎస్ పరివేద గ్రామ శాఖ అధ్యక్షుడు ఇడబోయిన రాంచంద్రం మృతి బిఆర్‌ఎస్‌కి తీరనిలోటని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పరివేద గ్రామ శాఖ అధ్యక్షుడు ఇడబోయిన రాంచంద్రం బ్రెయిన్ ట్యూమర్‌తో మృతిచెందాడు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ గురువారం రోజున రాంచంద్రం పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సతీష్ పరామర్శించి, మీకు అండగా ఉంటాను అని భరోసా కల్పించారు. అనంతరం కోహెడ మండలంలోని వివిధ గ్రామాల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సతీష్ పరామర్శించారు.

రాంచంద్రాపూర్ గ్రామంలో బొబ్బల వెంకటమ్మ, కోరుట్ల రాయమల్లు, బస్వాపూర్ గ్రామంలో తుపాకుల నారాయణ, మ హ్మద్ జానిమియా, మైసంపల్లి గ్రామంలో కళాకారుడు ఎనగందుల చందు మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వొడితల సతీష్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో… బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, యువత మండల అధ్యక్షుడు జాలిగం శంకర్, నాయకులు కొక్కుల సురేష్, తిప్పారపు శ్రీకాంత్, పొన్నాల లక్ష్మయ్య, కొక్కుల రమేష్, అబ్దుల్ రహీం, నాగరాజు మధుసూదన్ రావు, తిప్పారపు నాగరాజు, బత్తిని తిరుపతి గౌడ్, వేల్పుల శంకర్, మాంకాల అంజయ్య, ద్యావర శ్రీనివాస్, తాటిపాముల తిరుపతి, మాంకాల రమేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News