Monday, January 20, 2025

‘సర్కారోడు’గా చరణ్?

- Advertisement -
- Advertisement -

Ramcharan 15th movie updates

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శంకర్ మార్క్ కంటెంట్‌తో చరణ్ ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్ పరిసరాల్లో.. రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఇంకా విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేయలేదు. అయితే ఇందులో చరణ్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై సినిమా ప్రారంభం దగ్గర నుంచే ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చరణ్ రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న రోల్స్ లో కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది. ఐపిఎస్ ఆఫీసర్‌గా పనిచేసే చరణ్ వ్యవస్థలో మార్పులకు కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ నాయకుడిగా టర్న్ తీసుకుంటాడు.

ఆ తర్వాత రాజకీయ వ్యవస్థతో పాటు.. సమాజంలో వచ్చే మార్పుల్ని సినిమాలో ప్రధానంగా హైలైట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా ఇతివృత్తానికి పక్కాగా సరిపోయే టైటిల్ ఇదని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఈనెల 27న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News