- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ కొంత మేరకు బ్యాలెన్స్‌గా ఉంది. అయితే ఆ మిగిలి ఉన్న బ్యాలెన్స్ పోర్షన్ ఏమిటి అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. కానీ దీనిపై ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్రంలో ఇంకా కేవలం రెండు పాటలు తాలూకా షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని… అవి పూర్తయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. కాబట్టి షూటింగ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. అలాగే ఈ భారీ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచే ప్రారంభిస్తున్నట్లుగా తెలిసింది.
- Advertisement -