Friday, December 20, 2024

రెండు పాత్రలు… మూడు విభిన్నమైన గెటప్స్!

- Advertisement -
- Advertisement -

Ramcharan RC15 movie updates

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, – స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కెరీర్‌లో 15వ చిత్రం కావడం.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం.. దిల్ రాజు బ్యానర్‌లో మైలురాయి 50వ చిత్రం కావడం ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇప్పటికే ‘ఆర్‌సి15’కు సంబంధించి కీలకమైన రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. తాజా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే రాజమండ్రిలో మొదలైంది. రామ్‌చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారని తెలిసింది. తండ్రి, కొడుకుగా చరణ్ కనిపించనున్నారని.. కాకపోతే రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్‌లో ఉండవని అంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రి షెడ్యూల్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో ఫాదర్ రోల్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోందని సమాచారం.

ఇందులో చరణ్ పంచె కట్టులో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా శంకర్ ‘ఆర్‌సి15’లో రామ్‌చరణ్‌ని ఇంతకుముందెన్నడు చూడని విధంగా.. సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారని తెలిసింది. ఇక ఈ సినిమా ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిలర్. విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో తెరకెక్కుతోంది. దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో చరణ్ గెటప్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన శంకర్.. ఐఏయస్ ఆఫీసర్, – చీఫ్ మినిస్టర్‌తో పాటుగా సాధారణ యువకుడిగా హీరోని చూపించబోతున్నారట. చెర్రీ మేకోవర్, గెటప్స్ వెండి తెర మీద సినీ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 2023 సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News