Monday, December 23, 2024

కారు ప్రమాదానికి గురైన కేంద్ర మంత్రి.. తృటిలో మిస్

- Advertisement -
- Advertisement -

కేంద్ర సహాయమంత్రి రామ్ దాస్ అథవాలేకు గురువారం సాయంత్రం తృటిలో ప్రమాదం తప్పింది. రాందాస్ అథవాలే మహారాష్ట్ర సతారా జిల్లా వాయి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వాహనం సడన్ బ్రేకులు వేయడంతో అతని కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

అథవాలే గత నెలలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తాను షిర్డీ లేదా షోలాపూర్ సీటు నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నానని, బీజేపీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

“నా పార్టీకి లోక్‌సభలో ఒక్క సభ్యుడు కూడా లేడు. నేను షిర్డీ లేదా షోలాపూర్ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నాను. నేను లోక్‌సభకు రావాలనుకుంటున్నాను. దీనిపై జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను”. అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News