Sunday, December 22, 2024

నితీశ్ తిరిగి ఎన్‌డిఎ గూటికొస్తారు: కేంద్ర మంత్రి అథవాలే

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ సిఎం, జెడియు నేత నితీశ్‌కుమార్ తమ వాడని, ఆయన ఎప్పుడైనా ఎన్‌డిఎకు తిరిగి రావచ్చునని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత సహాయ మంత్రి అయిన రాందాస్ బీహార్‌కు శనివారం పలు కేంద్ర సంక్షేమ పథకాల ప్రారంభానికి వచ్చారు. ఈ సందర్బంగా ఈ మంత్రి మాట్లాడుతూ ‘నితీశ్ హమారే హై …హమారే పాస్ కభీ ఆసాక్తే హై ( నితీశ్ మాలో ఒక్కరు, ఎప్పుడైనా తిరిగి మా గూటికి చేరవచ్చు) అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీప్ అయిన రాందాస్ నితీశ్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్‌డిఎలో నితీశ్ లోటు పూడ్చలేనిదన్నారు.ఆయన తనకు మంచి స్నేహితుడు అన్నారు. ముంబైలో జరిగే ఇండియా భేటీకి ఆయన హాజరు కాకుండా ఉండాలని తాను సూచిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News