Thursday, January 23, 2025

ఝార్ఖండ్ మంత్రిగా రామ్‌దాస్ సోరెన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

జెఎంఎం శాసనసభ్యుడు రామ్‌దాస్ సోరెన్ శుక్రవారం ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఘటశిల ఎంఎల్‌ఎ రామ్‌దాస్ సోరెన్ రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ స్థానాన్ని భర్తీ చేశారు. రాంచీలోని రాజ్ భవన్‌లో ఒక కార్యక్రమంలో రామ్‌దాస్ సోరెన్‌తో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, జెఎంఎం కూటమిలోని సీనియర్ నేతలు, పలువురు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News