Monday, November 18, 2024

రామేశ్వరం కేఫ్ పేలుడు: ఐఇడి అమర్చిన అనుమానితుడి కోసం వేట

- Advertisement -
- Advertisement -

ఐఇడి అమర్చిన అనుమానితుడి కోసం వేట
సిసిటివి పుటేజ్‌లో అనుమానితుడి కదలికలు
బెంగళూరువ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
రామేశ్వరం కేఫ్ పేలుడు ఉగ్రవాద చర్యే

బెంగళూరు: బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం ఐఇడిని అమర్చిన అనంతరం వెలుపలికి వచ్చిన ఒక వ్యక్తి తన చేతి గడియారాన్ని చూసుకోవడం తాజాగా బయటపడిన సిసిటివి ఫుటేజ్‌లో కనిపించింది. శుక్రవారం మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్న పోలీసులు యుఎపిఎలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

శుక్రవారం ఉదయం 11.50 ంటలకు తెలుపు రంగు క్యాప్, నలుపు రంగు ఫేస్ మాస్కు, వీపుకు బ్యాగు, పొడుగు చేతుల షర్ట్, నలుపు రంగు ప్యాంటు, షూస్ ధరించిన అనుమానితుడు కేఫ్ నుంచి వెలుపలకు రావడం సమీపంలోని మరో షాపు వద్ద గల సిసిటివి ఫుటేజ్‌లో కనిపించింది. సరిగ్గా 11.50 గంటల 29 సెకన్లకు తన చేతి గడియారాన్ని అనుమానితుడు చూసుకోవడం కనిపించింది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అనుమానితుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా&రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు. ఈ పేలుడులో గాయపడిన 10 మంది కోలుకుంటున్నారని, ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.

అయితే..ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంతకుముందు పోలీసు వర్గాలు తెలిపాయి. కర్నాటకలోని ధార్వాడ్, హుబ్బలి, బెంగళూరులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఐఇడిని ఉపయోగించిన సృష్టించిన ఈ పేలుడుపై దర్యాప్తు వేగంగా జరుగుతోందని దయానంద తెలిపారు. అనేక పోలీసు బృందాలు ఈ కేసులో పనిచేస్తున్నాయని, అనేక విషయాలు దర్యాప్తులో బయటకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసు సున్నితత్వాన్ని, భద్రతా ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఊహాగానాలతో వార్తలు రాయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా&బెంగళూరు నగరమంతటా ముఖ్యంగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ్రప్రదేశాలలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News