Wednesday, January 22, 2025

సిఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ

- Advertisement -
- Advertisement -

Ramgopal varma meets CM Jagan

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు సమావేశమయ్యారు. వర్మ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయలుదేరారు. సిఎం జగన్, వర్మ దాదాపు 30 నిమిషాలకు పైగా సమావేశమైనట్లు సమాచారం. అనంతరం ఆర్జీవీ, సీఎం జగన్ అక్కడే భోజనం చేశారు. గతంలో సినిమా టిక్కెట్ ధరల విషయమై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సమయంలో వర్మ ఒకసారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ అధికారులతో వర్మ సమావేశమైన దాఖలాలు లేవు. ఇప్పుడు విజయవాడలో ఊహించని రీతిలో హాజరు కావడం, ఆ తర్వాత సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News