Sunday, November 24, 2024

‘రాధేశ్యామ్’ చిత్రంపై రామ్‌గోపాల్ వర్మ ఏమన్నారు?

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకదానితో వివాదంలో నిలుస్తుంటారు. ఒకప్పుడు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన ఇటీవల ఫ్లాప్ సినిమాలకు పేరుపడ్డాడు. కానీ మీడియాలో ఏదో ఒకటి చెప్పి అందరూ అతడిని మరచిపోకుండా చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ చిత్రం మీద వ్యాఖ్యలు చేశాడు.
‘రాధేశ్యామ్ కథానాయకుడు ప్రభాస్ పారితోషికం పక్కన పెడితే…ఈ చిత్రం మొత్తం బడ్జెట్‌లో ఐదవ వంతు ఖర్చుతో సినిమా తీసేయొచ్చు. రాధేశ్యామ్ వంటి ఇంటెన్స్ లవ్‌స్టోరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరంలేదు. కథలోని భావోద్వేగం, భావాలను విజువల్ ఫీస్ట్ డామినేట్ చేస్తాయి. ఇది కథను చంపేస్తుంది’ అన్నాడు. ఇక బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి విడుదలయ్యే వరకు ఎవరికీ తెలియదు. కేవలం రూ. 4 లేక 5 కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిందని పేర్కొన్నాడు. రాధేశ్యామ్ సినిమాకు పెట్టిన పెట్టుబడి, వచ్చిన వసూళ్లకు పొంతనే లేదన్నాడు. మూవీకి విజువల్ ఎఫెక్ట్ కన్నా కథలో దమ్ము ముఖ్యమని ఈ రెండు సినిమాలు రుజువుచేశాయన్నాడు. రాధేశ్యామ్ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను అతి తక్కువ బడ్జెట్‌తో తీసి హిట్ సాధించారు. సినిమాలు రూపొందించేవారు చేదు నిజాన్ని గ్రహించాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News