- Advertisement -
హీరో అల్లుఅర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లుఅర్జున్ కు నాంపల్లి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బాలుడిని పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లేందుకు బన్నీ పోలీసుల అనుమతి కోరాడు. అయితే, పోలీసులు ఆయన అనుమతిని నిరాకరించారు.కిమ్స్ ఆస్పత్రికి వెళ్లొద్దని.. ఒకవేళ వెళ్తే.. అక్కడ జరిగే పరిణామాలకు మీదే బాధ్యత అంటూ అల్లుఅర్జున్ కు నోటీసులు నోటీసులు ఇచ్చారు.
- Advertisement -