Wednesday, January 22, 2025

సిఐడి విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధప్రదేశ్‌లో మార్గదర్శిపై సిఐడి విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరయ్యారు. సిఐడి విచారణకు హాజరుకాలేమని రామోజీరావు, శైలజా కిరణ్ మెయిల్ పంపారు. అనారోగ్యంతో విచారణకు హాజరు కాలేనని సిఐడికి రామోజీరావు మెయిల్ చేశారు. రాలేని పరిస్థితుల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని సిఐడి అధికారులకు మార్గదర్శి ఎండి శైలజ సమాచారం ఇచ్చారు. విచారణకు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు హాజరయ్యారు. హాజరుకాలేని పరిస్థితుల్లో ఉన్నామని ఎ1 రామోజీరావు, ఎ2 శైలజా కిరణ్ తెలిపారు. బుధవారం గుంటూరు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని గతంలో నోటీసులు అందజేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో 41ఎ కింద సిఐడి నోటీసులు జారీ చేసింది. విచారణకు రాలేమని చెప్పడంతో మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Also Read: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. బిజెపి నేత అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News