Friday, December 20, 2024

సిఐడి విచారణకు హాజరుకాని రామోజీరావు, శైలజా కిరణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్‌లు సిఐడి విచారణకు బుధవారం హాజరు కాలేదు. ఈ విషయాన్ని వారు అధికారులకు ముందుగానే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. రామోజీరావు ఆరోగ్యం బాగాలేదని, అందుకే గుంటూరులో జరిగే ఈ విచారణకు హాజరు కాలేకపోతున్నామని అందులో పేర్కొన్నారు. ఆర్‌బిఐ నిబంధనలు, చిట్ ఫండ్స్ విషయంలో ఉన్న కేంద్ర చట్టాలను ఉల్లంఘించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో రామోజీరావు ఎ1గా, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ఎ2గా ఉన్నారు.

వీరిద్దరిని ఎపిలో విచారించాలని సిఐడి నిర్ణయిం చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గత నెల 22వ తేదీన అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో జూలై 5వ తేదీన ఉదయం 10:30 గంట లకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని వెల్లడించింది. అయితే, కొంత కాలం కిందట ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌కు వచ్చి విచారణ జరపాలని నిర్ణయించారు. అయితే ఆ అధికారులను రామోజీరావు సిబ్బంది చాలా సేపు అడ్డుకు న్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రాంతీయ ఆఫీసుకు రావాలని సిఆర్‌పిసి 41(ఎ) ప్రకారం సిఐడి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News