Thursday, January 23, 2025

మరపురాని చిత్రాలను అందించిన రామోజీరావు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరు కూరి రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. 1983 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించిన రామోజీ రావు ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకు లకు అందించారు. ‘శ్రీవారికి ప్రేమ లేఖ’, ‘మయూరి’, ‘ప్రతిఘటన’, ‘మౌనపోరాటం’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘చిత్రం’, ‘నువ్వే కావాలి’, ‘ఆ నందం’, ‘ఇష్టం’ వంటి ఎన్నో మరుపురాని సినిమాలు ఈ బ్యాన ర్‌లోనే రూపుదిద్దుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయం చేసింది కూడా ఉషాకిరణ్ మూవీస్ సంస్థ కావడం విశేషం. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ఇప్పటివరకు 87 సినిమాలు తెరకెక్కాయి.

ప్రతిభావంతులైన దర్శకులు, -నటీనటులు-, రచయితలు ఎంతో మందిని ఉషా కిరణ్ మూవీస్ ద్వారా పరిచయం చేశారు నిర్మాత రామోజీరావు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, దివగంత నటుడు ఉదయ్ కిరణ్, హీరో తరుణ్, దర్శకుడు తేజ, హీరోయిన్ శ్రియా లాంటి ఎంతోమందిని తెలుగు సినిమాకు అందించారు.

గొప్ప చిత్రాలను నిర్మించి…

నిజ జీవితాల నుంచే కథలు పుడతాయని ఉషాకిరణ్ సంస్థ నిరూపించింది. అందుకు ’మయూ రి’ సినిమా ఓ ఉదాహరణ. ప్రమాదంలో కాలు పొగొట్టుకుని కృత్రిమ పాదంతో నాట్యంలో రా ణించిన సుధా చంద్రన్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఓడిశా సంఘటన ఆధారంగా మౌన పోరాటం సినిమాను నిర్మించారు. జాతీయ క్రీడాకారణి అశ్వని నాచప్ప బయోపిక్ ’అశ్వని’ వంటి చిత్రాలను నిర్మించి ఆయన తన అభిరుచి వేరు అని నిరూపించుకున్నారు. లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో టి.కృష్ణ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ప్రతిఘటన సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక యు. విశ్వేశ్వర రావు దర్శకత్వంలో 1978లో వచ్చిన ’మార్పు’ అనే సినిమాలో రామోజీ రావు ఒక అతిధి పాత్రలో కనిపించడం విశేషం. ఇందులో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు.

ఆ కోరిక తీరకుండానే..

ఉషాకిరణ్ సంస్థపై 100 సినిమాలను నిర్మించాలని సంకల్పించారు రామోజీరావు. అందుకు సంబంధించిన పనులను కూడా ఆయన మొ దలు పెట్టారు. కొంత మంది దర్శకులతో చర్చ లు జరపడం జరిగిందని సమాచారం. 2019 లోనే ఆ పనులు మొదలు పెట్టాలని చూశారట. కానీ కరోనా వైరస్ తాండవించడంతో తాత్కాలికంగా ఆలోచన విరమించుకున్నారట. ఆ విధంగా రామోజీరావు 100 సినిమాలు నిర్మించాలన్న కోరిక తీరకుండానే కన్నుమూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News