Saturday, November 2, 2024

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్ : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యు లు, అభిమానాలు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికా రు. శనివార మంతా ప్రజల సందర్శనార్థం రామో జీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ కార్యాల యంలో ఉం చిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఆదివారం ఉ దయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ స భ్యులు కడసారి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఆ తర్వాత రామోజీరా వు పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కు టుంబ సభ్యులు పార్థివదేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అక్షర సూరీడి అ ఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆ యా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులు అర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు.

తరలివచ్చిన ప్రముఖులు
రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్‌సిటీ ఆవరణలోని స్మృతివనం వరకూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసే రామోజీ గ్రూపు ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్యసాధకుడికి కన్నీటివీడ్కోలు పలికారు. అశ్రు నయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృ తివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చం ద్రబాబు నాయుడు రామోజీరావు పాడె మోశారు. ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ సహా గ్రూప్ ఉన్నతోద్యోగులు పాడె మోశారు.

అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారి నివాళి అర్పించారు. ఎపి ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, ఆర్పీ సిసోదియా, సాయి ప్రసాద్ శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుజాతి ముద్దు బిడ్డను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

అనంతరం రామోజీరావు భౌతిక కాయాన్ని చితిపైకి చేర్చారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, బిఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పోచారం, మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు, ఎంఎల్‌ఎ అరికపూడి గాంధీ తదితరులు పాల్గొ న్నారు. ఎంపిలు కెఆర్ సురేశ్ రెడ్డి, పెద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి, విహెచ్, టిడిపి ఎంఎల్‌ఎ రఘురామక్రిష్ణ రాజు, వెనిగండ్ల రాము, బిజెపి ఎంపిలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎపి నాయకులు సుజనా చౌదరి, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్, సీనియర్ నటుడు మురళీమోహన్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సహా ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు.

రామోజీరావు ఇచ్చిన ఆ సూచన ఎప్పటికీ మరువను : లోకేశ్
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. ఫిలింసిటీలోని రామోజీరావు నివాసం నుంచి స్మారక ప్రదేశం వరకు జరిగిన అంతిమయాత్రలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. అక్షర యోధుడికి చివరి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రామోజీరావు తనకు మార్గదర్శకులు అని వెల్లడించారు. రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావుది ఓ చరిత్ర అని కొనియాడారు. ‘నా లాంటి యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావుది. ఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధాన నిర్ణయాలు తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదు. ఏరంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురమ్మని రామోజీరావు నాకు నిత్యం ఇచ్చే సూచన ఎప్పటికీ మరువను. రామోజీరావురామోజీరావు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం‘ అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News