Monday, December 23, 2024

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంతిమ సంస్కారాలు నిర్వహించింది. రామోజీ రావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్షర యోధుడికి కడసారి చూపు కోసం వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఈనాడు, ఈటివి గ్రూపు సంస్థల ఉద్యోగులు, రామోజీ అభిమానులు భారీగా తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామోజీరావు పాడెను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మోశారు. అంతిమయాత్ర కొనసాగుతుండగా జోహార్ రామోజీరావు అంటూ ఉద్యోగులు, సిబ్బంది, అభిమానులు నినాదాలు చేశారు. ఈ అంతిమ యాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బిజెపి నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వర్ రావు, విహనుమంతరావు, కెఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, తదతరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News