Friday, December 20, 2024

అక్షరయోధుడు అస్తమయం

- Advertisement -
- Advertisement -

మీడియా మొఘల్‌గా వినుతికెక్కిన రామోజీ విభిన్న రంగాల్లో
ప్రతిభచాటిన పద్మవిభూషణ్ నేటి ఉదయం అధికారిక
లాంఛనాలతో అంత్యక్రియలు పలువురు రాజకీయ,
సినీ ప్రముఖుల నివాళి సిఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

మనతెలంగాణ/హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు(88) తీ వ్ర అనారోగ్యంతో అస్వస్థతకు గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జా మున కన్నుమూసారు. ఇటివల రామోజీరావు కు గుండె సమస్య ఉత్పన్నం కావడంతో స్టంట్ వేశారు.కాగా శుక్రవారం మాద్యాహ్నం 3 గం టలకు అస్వస్థతకు గురి కావడంతో నానక్‌రామ్‌గూడలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆరో గ్యం విషయంగా ఉండటంతో వెంటిలెటర్ పై చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తు దిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. అ నంతరం కుటుంబ సభ్యులు రామోజీరావు పా ర్ధివదేహాన్ని రామోజీ ఫిలీం సిటికి తరలించి అ భిమానుల సందర్శనార్ధం ఉంచారు.కృష్ణాజిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రై తు కుటుంబంలో 1936 నవంబర్ 16న చెరుకూ రి వెంకటసబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకురామోజీరావు జన్మించారు. రామోజీరావుకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మలు ఇ ద్దరు అక్కలు ఉన్నారు.

Ramoji rao passed away

కుటుంబ సభ్యులు రామోజీకి రామయ్య అని పేరు పెట్టగా బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటినుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. 1947 నుండి 1951 వరకు చదివి బీఎస్సీ పూర్తి చే శారు. 1961లో తాతినేని రామాదేవితో వివాహం జరిగింది. వివిధ రంగాలలో పాటు మీడియా రం గంలో రాణించి తనదైన పాత్ర పోషించారు. 1974 ఆగస్టు 10 విశాఖ సాగర తీరంలో ఈనా డును ప్రారంభించారు. అంచలంచలుగా ఎదిగి 1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరిగా రా మోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి సినీ పరిశ్రమలో ప్రశంసలు అందుకున్నారు. రామోజీరావుకు కిరణ్, సుమన్ ఇద్దరు కుమారుల ఉండగా గతంలో అనారోగ్యంతో రెండో కుమారుడు సుమన్ మృతి చెందారు. రామోజీరావు మృతితో రామోజీ ఫిల్మ్ సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నేడు రామోజీరావు అంత్యక్రియలు

రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.. రామోజీరావు మనవడు అమెరికా నుండి రావల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికార్లకు ఆదేశాలు జారీ చేయడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు జీవించి ఉండగానే సొంతగా నిర్మించుకున్న స్మారక చిహ్నంలో అం త్యక్రియలను నిర్వహించనున్నారు.

Celebrities paid tribute to Ramoji Rao's body

 

రాజకీయ ప్రముఖుల నివాళి

రామోజీరావు మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు నివాళ్లు అర్పించి సంతాపం తెలిపారు. టిడి పి అధినేత నారా చంద్రబాబు, భువనేశ్వరి రామోజీరావు పార్ధివదేహాన్నికి పూలమాలలు వేసి నివా ళ్లు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్, శాసనమండలి స్పీక ర్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌లు హజరై పూలమాలలు వేసి నివాళ్లుర్పించారు. ఈ సందర్బంగా రామోజీరావు సేవలను గుర్తు చేసుకున్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి, సిజె సంతాపం

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామోజీపార్ధివదేహాన్నికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. మాజీ సీజే రమణ రామోజీరావు పా ర్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బిఆర్‌ఎస్ నేతల నివాళి

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి తన్నీర్ హరిష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, పూవ్వాడ అజ య్, మాజీ స్పీకర్ మధుసూదనాచారీ, ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు మం చిరెడ్డి కిషన్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.

దత్తాత్రేయ నివాళి..

హర్యణ గవర్నర్ బండారు దత్తాత్రేయ రామోజీరావు పార్ధివ దేహాన్ని సందర్శించి పూలమాలు వేసి నివాళ్లు అర్పించి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

సినీ ప్రముఖుల నివాళ్లు

రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళ్లు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, మురళీమోహన్, విష్ణు, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, తరుణ్, నరేష్, సాయికుమార్, రాజామౌళి, అశ్వినీదత్తు, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, కీరవాణి, శివాజీ, బ్రహ్మనందం, అన్నపూర్ణ, చంద్రబోస్, క్రిస్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డితో పాటు పలువురు నివాళ్లు అర్పించారు.

ఎపి నేతల సంతాపం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా, రాఘురామరాజు, పరిటాల సునీత, సుజనా చౌదరితో పాటు పలువురు నేతలు రామోజీరావు పార్దీవ దేహాన్నికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News