- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి స్థానం నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆమెకు అభినందనలు తెలుపుతూ రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు లేఖ రాశారు. ‘నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయిన మీకు హార్థిక అభినందనలు తెలియజేస్తున్నారు. ఎంఎల్సి ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసన మండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించే జననాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజా సేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తున్నాన’ని కల్వకుంట్ల కవితను కొనియాడుతూ రామోజీరావు లేఖ రాశారు.
- Advertisement -