Monday, January 20, 2025

అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు: రేవంత్ ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు జర్నలిజానికి రామోజీ రావు లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఆయన అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ అంత్యక్రియ ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు ప్రధాన కార్యదర్శి ద్వారా ఆదేశించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News