Monday, December 23, 2024

రేపు చెన్నై మెరీనా బీచ్ ‘రాంప్’ ప్రారంభించనున్న స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు సమద్రతీరాన్ని చేరుకోవడం అన్నది వికలాంగులకు కష్టసాధ్యం. వారి ప్రయోజనార్థం మెరీనా బీచ్ వద్ద ఓ రాంప్(వాలు ప్రాంత నడవ)ను ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ప్రారంభించనున్నారు. చెక్కతో చేసిన రాంప్ వికలాంగులకు చాలా సౌకర్యంగా ఉండగలదని అధికారిక ప్రకటన పేర్కొంది. సముద్రపు ఒడ్డున చల్లగాలి, వ్యాహాలి సౌక్యం ఇకపై వికలాంగులకు కూడా సునాయాసంగా ఉండనున్నది. ఈ రాంప్ 235 పొడవు, 3.4 మీటర్ల వెడల్పు ఉండనున్నది. ఈ రాంప్‌ను మెరీనాలోని వివేకానంద హౌస్ ఎదురుగా రూ. 1.5 కోట్లతో నిర్మించారు. ముఖ్యంగా ఇది వికలాంగులకు, సీనియర్ సిటిజన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. రాంప్ అంతటా ఊతం కోసం ఇరువైపులా ‘హ్యాండ్‌రైల్స్’ కూడా ఏర్పాటుచేశారు. మెరీనా బీచ్‌లో శాశ్వత రాంప్ కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్‌లో ఆ నిర్మాణ పని మొదలెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News