Monday, December 23, 2024

రామ్ ‘ది వారియర్’ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్ ను ఖారారు చేశారు. ఇక, పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో ఉన్న రామ్ సీరియస్ గా చేస్తున్న లుక్ ఆకట్టుకునేలా ఉంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Ram’s ‘THE WARRIOR’ First look poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News