Wednesday, January 22, 2025

రాముడు మాంసాహారి.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

“రాముడు బహుజన వర్గానికి చెందినవాడు. ఆయన మాంసాహారి. జంతువులను వేటాడి తినేవాడు. కానీ రాముణ్ని చూపించి, ఆయనలాగ అందరూ శాకాహారులు కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. పద్నాలుగేళ్లు అడవిలో ఉన్న వ్యక్తికి శాకాహారం ఎలా దొరుకుతుంది?”- ఎన్ సిపి ఎమ్మెల్యే జితేంద్ర అవద్ చేసిన వ్యాఖ్యలివి. అయోధ్య రామమందిరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

జితేంద్ర అవద్… శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఆయన బుధవారం షిరిడీలో జరిగిన ఒక కార్యక్రమానిక హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని, అందుకు క్షమాపణ చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News