Wednesday, January 22, 2025

బిజెపి నాయకులను మా తండాల్లోకి రానివ్వం : రాములు నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మధ్యప్రదేశ్ లో బిజెపి నాయకుడు, ఆ పార్టీ ఎంఎల్‌ఎ శుక్లా అనుచరుడు ఒక గిరిజనుడిపై మూత్ర విసర్జన చేయడాన్ని మాజీ ఎంఎల్‌సి రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర పతి ముర్ము ను పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని తెలిపారు. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన బిజెని నాయకుడిపై ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వంచర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆ గిరిజనుడికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

బిజెపి నాయకులను మా తాండల్లోకి రానివ్వమని హెచ్చరించారు. ఈ నెల 8న ప్రధాని సభలో నల్లజెండాలు ప్రదర్శిస్తామని ప్రకటించారు. మా ఎస్‌టి జాతీయ చైర్మన్ పిలుపు మేరకు పోరాట కార్యక్రమాలు చేపడుతామని, గవర్నర్ ను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని ఆ బిజెపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న 15 కోట్ల మంది గిరిజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గిరిజనులకు మరింత న్యాయం చేస్తాంమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News