- Advertisement -
అమరావతి: గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ లో ప్రారంభమై ఈ నెల 26న కేసు విచారణ ముగిసింది. గతేడాది ఆగష్టు 15న బిటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురైంది. బలమైన సెక్షన్ల ఆధారంగా న్యాయమూర్తి రాంగోపాల్ శిక్షను ఖరారు చేశారు. తొమ్మిది నెలలలో పూర్తి విచారణ పూర్తైంది. రమ్యకు సోషల్ మీడియాలో శశికృష్ణ పరిచయం అయ్యాడు. ప్రేమ వేధింపులు పెరగడంతో శశికృష్ణ ఫోన్ నంబర్ ను రమ్య బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిందనే కోపంతో నిందితుడు ఈ హత్యచేశాడు. సిసి ఫుటేజ్ ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -