Monday, December 23, 2024

‘లైగర్’ సినిమాలో రమ్య కృష్ణన్ నటన అదుర్స్ !

- Advertisement -
- Advertisement -

 

Ramya Krishnan

 ఆమె నటనకే జోహార్లంటున్న ట్విట్టర్స్ !!

హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ట్రయిలర్ను విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో విజయ్  ఓ కిక్-బాక్సర్ గా  కనిపించబోతున్నాడు. కాగా అతడి ప్రేయసిగా నటి అనన్య నటిస్తోంది. దేవరకొండ విజయ్ తల్లి పాత్రలో రమ్య కృష్ణన్ నటించింది. ఓ ట్విట్టర్ ఆ సినిమా ట్రయిలర్ చూసినప్పుడు రమ్య కృష్ణన్ నటన అబ్బురపరిచిందని, హిట్ సినిమా ‘బాహుబలి’లో ఆమె శివగామిగా చేసిన పాత్రను మరోసారి గుర్తుచేసిందని తెలిపాడు. ధర్మ ప్రొడక్షన్ కింద నిర్మంచిన ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించారు. దక్షిణాది చిత్రంలో అనన్య పాండేకిది డెబు చిత్రం. ఈ సినిమాలో హిరో, హిరోయిన్ నటన చాలా ఫాస్ట్ఫేజ్లో ఉంటుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆగస్టు 25న థియేటర్లలోకి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News