Sunday, December 22, 2024

రానా అండ్ తేజ కాంబినేషన్లో మరో భారీ చిత్రానికి శ్రీకారం…

- Advertisement -
- Advertisement -

హీరో రానా అండ్ డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన నేనేరాజు నేనే మంత్రి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. వీరి కలయికలో రాబోతున్న సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. నేనేరాజు నెనేమంత్రి సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రకు మరింత బలంగా ఈ సినిమాలో రానా క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు దర్శకుడు తేజ. నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట… రానా & తేజ కాంబినేషన్ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో నటించబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News