Monday, December 23, 2024

పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా..

- Advertisement -
- Advertisement -

బాబాయ్ అబ్బాయ్ వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి తండ్రీకొడుకులుగా తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకటేష్ నాగ నాయుడు, రానా.. రానా నాయుడు పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి కొడుకుల వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హై ఆక్టేన్, హై ఎనర్జీ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ ప్రాజెక్ట్ ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈనెల 10న ‘రానా నాయుడు’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానున్న నేపద్యంలో హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్‌లో వెంకష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుందర్ ఆరోన్, సుపర్ణ్ వర్మ, కరుణ్ అన్షుమాన్ ‘రానా నాయుడు’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ “ఇలాంటి ప్రాజెక్ట్ నాకు, బాబాయ్ కి కొత్త. రానా నాయుడు కోసం బాబాయ్ తో మొదటి రోజు పని చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మర్చిపోలేని అనుభూతి ఇది. నేను ఇప్పటి వరకూ పాజిటివ్, నెగిటివ్ రోల్స్ చేశాను. కానీ రానా నాయుడు లో రెండూ వున్నాయి”అని అన్నారు. వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ “ఎంతో ప్రతిభ కలిగిన రానాతో స్క్రీన్‌ను పంచుకోవడం హైలెట్. మేము ఒక సిరీస్‌లో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News