Thursday, January 9, 2025

‘దేవకీ నందన వాసుదేవ’ స్పెషల్ మూవీ అవుతుంది

- Advertisement -
- Advertisement -

తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ’దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. మంగళవారం రానా దగ్గుబాటి, సందీప్ కిషన్ కలిసి ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి అశోక్ గల్లా, టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. దేవకి నందన వాసుదేవ ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రానా మాట్లాడుతూ ..“ఇది కృష్ణుడు, కంసుడు నుంచి స్ఫూర్తి పొంది రాసిన సోషల్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అర్జున్, ప్రొడ్యూసర్ బాలకృష్ణ.. ఒకరు అర్జునుడు మరొకడు కృష్ణుడు. ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఒక స్పెషల్ మూవీ అవుతుంది”అని తెలిపారు.

హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ “ఇంత అద్భుతమైన కథ అందించిన ప్రశాంత్ వర్మకి ధన్యవాదాలు. అర్జున్ తన విజన్‌తో సినిమాని మరో రెండు మెట్లు పైకి తీసుకెళ్లారు”అని అన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “ప్రతి కథ మీద హీరో పేరు రాసి ఉంటుంది. ఈ కథపై అశోక్ పేరు రాసి ఉంది. మంచి ఫ్యామిలీ ఫిలిం ఇది. లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. ట్రైలర్‌లో ఏదైతే ఎనర్జీ చూశారో సినిమాలో ఆ ఎనర్జీ ఉంటుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “నన్ను ఎంతగానో ప్రోత్సహించిన ప్రశాంత్ వర్మకి కృతజ్ఞతలు. సాయి మధు బుర్ర చాలా అద్భుతమైన మాటలు రాశారు. సినిమా గురించి ట్రైలర్ మాట్లాడుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర, గల్లా జయదేవ్, హీరోయిన్ మానస వారణాసి, నిర్మాత బాలకృష్ణ, డిస్ట్రిబ్యూటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News