Sunday, December 22, 2024

సమంతతో తరచూ మాట్లాడుతుంటా: రానా

- Advertisement -
- Advertisement -

రానా దగ్గుబాటి, ప్రస్తుతం తన రాబోయే వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రానా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంతంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమయం దొరికినప్పుడల్లా సమంతతో మాట్లాడుతానని వెల్లడించారు. సామ్ మయోసైటిస్ బారినపడిన విషయం తెలియగానే ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నానని వివరించారు.

నటీనటులు తమకున్న సమస్యల గురించి ప్రంచానికి చెప్పాలా? వద్దా? అనేది వారి వ్యక్తిగత విషయమని ప్రతిఒక్కరి జీవితంలో కష్టాలుంటాయన్నారు. వాటిని ఎదుర్కొని ముందుకు సాగడంలోనే ఆనందరం ఉందని రానా పేర్కొన్నారు. రానా దగ్గుబాటి కజిన్ మరియు నటుడు నాగ చైతన్యతో సమంత వివాహం జరిగింది. ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో, సమంత మయోసిటిస్‌కు చికిత్స పొంది వేగంగా కోలుకుందని వైద్యులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News