Sunday, December 22, 2024

ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా: రానా

- Advertisement -
- Advertisement -

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ‘35- చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. ‘35- చిన్న కథ కాదు‘ శుక్రవారం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ… “35- చిన్న కథ కాదు సినిమా చూశాను. నేను ఈమధ్య కాలంలో చూసిన మోస్ట్ బ్యూటీఫుల్ తెలుగు సినిమా ఇది. ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లలని తీసుకు వెళ్ళాల్సిన సినిమా”అని అన్నారు. మూవీ ప్రజెంటర్, హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇదని తెలిపారు.

డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని మాట్లాడుతూ “35 గురించి చెప్పాలంటే చిన్న కథ కాదు. నివేద, దర్శి, విశ్వ అందరూ అద్భుతంగా చేశారు”అని పేర్కొన్నారు. నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ “కన్నడలో కాంతార, మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్, తమిళ్‌లో మహారాజ, తెలుగులో ‘35-చిన్న కథ కాదు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నివేద థామస్, నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి, ప్రియదర్శి, విశ్వదేవ్, వివేక్ సాగర్, భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News