Wednesday, January 22, 2025

‘రానా నాయుడు’.. తండ్రి కొడుకుల వార్

- Advertisement -
- Advertisement -

బాబాయ్ అబ్బాయ్ వెంకటేశ్‌ దగ్గుబాటి, రానా దగ్గుబాటి తండ్రీకొడుకులుగా తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకటేశ్‌ నాగ నాయుడు, రానా.. రానా నాయుడు పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి కొడుకుల వార్ బ్యాగ్ డ్రాప్ లో సాగే హై ఆక్టేన్, హై ఎనర్జీ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా సాగే ఈ ప్రాజెక్ట్ ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘రానా నాయుడు’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలని పెంచింది. మార్చి 10న ‘రానా నాయుడు’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ కానున్న నేపద్యంలో హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుందర్ ఆరోన్, సుపర్ణ్ వర్మ కరుణ్ అన్షుమాన్ ‘రానా నాయుడు’ విశేషాలని పంచుకున్నారు.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మాపై కురిపించిన ప్రేమ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్రాజెక్ట్ నాకు, బాబాయ్ కి కొత్త. రానా నాయుడు కోసం బాబాయ్ తో మొదటి రోజు పని చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మర్చిపోలేని అనుభూతి ఇది. నేను ఇప్పటి వరకూ పాజిటివ్ నెగిటివ్ రోల్స్ చేశాను. కానీ రానా నాయుడు లో రెండూ వున్నాయి. రానా నాయుడు డార్క్ నేపధ్యం ఉన్న వ్యక్తి. తండ్రితో అతని సంబంధం మరింత డార్క్ గా వుంటుంది. ఈ ఫార్మెట్ లో చేయడం ఇదే మొదటిసారి. నెట్‌ఫ్లిక్స్‌తో స్ట్రీమింగ్ అరంగేట్రం చేయడం అమెజింగ్ రైడ్’’ అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటిమాట్లాడుతూ ‘’ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించిన మా అభిమానులకు, మీడియాకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులక కృతజ్ఞతలు. రానా నాయుడు నాకు కొత్త ప్రపంచం – ఇది నా మొదటి లాంగ్. -ఫార్మాట్ ప్రాజెక్ట్. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంతో ప్రతిభ కలిగిన రానాతో స్క్రీన్‌ను పంచుకోవడం హైలెట్. మేము ఒక సిరీస్‌లో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. మీ ఎంతో కష్టపడిన చేసిన ఈ షోని మీరందరూ నెట్‌ఫ్లిక్స్‌ లో చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

అనంతరం క్యూ అండ్ ఎ సెషన్ లో ప్రశ్నలు సమాధానాలు ఇస్తూ..

ఇందులో సెలబ్రిటీ ఫిక్సర్ గా కనిపిస్తున్నారు కదా.. అసలు సెలబ్రిటీ ఫిక్సర్ అంటే ఏమిటి ?

రానా: ఈ షోలో రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు సెలబ్రిటీలకు ఏ సమస్య వున్నా రానాకి ఫోన్ చేస్తారు. ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకుంటారు.

నాగ నాయుడు పాత్ర చేయడం ఎలా అనిపించింది ?

వెంకటేష్ : ఒక నటుడిగా కొత్త పాత్రలు చేయాలని వుంటుంది. రానా నాయుడు లో కొత్త చేయడానికి చాలా స్కోప్ దొరికింది. ఇలాంటి పాత్రని గతంలో ఎన్నడూ చేయలేదు. నా వరకూ ఇది చాలా కొత్తగా వుంటుంది.

ఇందులో సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?

రానా: రానా నాయుడు లో ఒక డిస్ ఫంక్షనల్ ఫ్యామిలీ వుంటుంది. అలాంటి ఫ్యామిలీ గురించి ఎప్పుడూ విని ఉండము. ప్రతి ఒక్కరితో ఒక ప్రాబ్లం వుంటుంది. డార్క్ ఫ్యామిలీ. వాళ్ళు చేసే పను బయటికి చెప్పుకునేలా వుండవు. ఇంత మ్యాడ్ నెస్ లో కూడా ఫ్యామిలీ అనే ఎమోషన్ వుంటుంది. ఇలాంటి కథలు సినిమాల్లో చేయడం కష్టం. సిరిస్ లో చేయడం కుదిరింది. ముంబైలో వుండే ఒక సౌత్ ఇండియన్ కథ ఇది. హైదరాబాద్ ల్ వున్న ఓ కుటుంబం ముంబై వెళ్లి అక్కడ గ్యాంగ్ స్టార్ పనులు చేస్తే ఎలా వుంటుందో అనే ఆసక్తికరమైన అంశాలు ఇందులో వుంటాయి. నిజంగా ఇదొక ప్రయోగాత్మకమైన ప్రయత్నం.

కరణ్, సుపర్ణ్ వర్మ లతో పని చేయడం ఎలా అనిపించిది ?

వెంకటేష్ : కరణ్, సుపర్ణ్ వర్మ లతో గ్రేట్ జర్నీ. ఓటీటీ లో చేయడం ఇదే మొదటిసాటి. బిగినింగ్ నుంచి ఎంతో గైడింగ్ వున్నారు. పది ఎపిసోడ్ లు వున్నాయి. మార్చి 10 నుంచి మీరంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నాగా నాయుడు పాత్ర లో చాలా షేడ్స్ వున్నాయి. ఇలాంటి షేడ్స్ వున్న పాత్రని ఎప్పుడూ చూడలేదు. ఎమోషనల్ సీన్స్ చాలా కొత్తగా పవర్ ఫుల్ గా వుంటాయి.

కరణ్, సుపర్ణ్ మాట్లాడుతూ… వెంకటేష్ గారు, రానా గారితో పని చేయడం ఆనందంగా వుంది. రానా నాయుడు చాలా డిఫరెంట్ షో. ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ కొత్తగా వుంటాయి. ప్రేక్షకుకులు ఖచ్చితంగా చాలా ఎక్సయిట్ అవుతారు’’ అన్నారు.

సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న సమిష్టి తారాగణం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగిస్తోందని భరోసా ఇచ్చింది. రానా నాయుడు మార్చి 10, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులో ఉంటుంది.

ప్రొడక్షన్ హౌస్: లోకోమోటివ్ గ్లోబల్

షోరన్నర్: కరణ్ అన్షుమాన్

దర్శకుడు: కరణ్ అన్షుమాన్ / సుపర్ణ్ వర్మ

నిర్మాత: సుందర్ ఆరోన్

తారాగణం: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News