Monday, December 23, 2024

శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడు: జైషాపై రణతుంగ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడు..
జైషాపై నిప్పులు చెరిగిన రణతుంగ
అర్జున ఆరోపణలపై పెను దుమారం
కొలంబో: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జైషాపై శ్రీలంక క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డును జైషానూ నడిపిస్తున్నాడని ఆరోపించాడు. లంక క్రికెట్ బోర్డు అధికారులు బిసిసిఐ చేతిలో కీలు బొమ్మల్లా మారారాని, జైషా ఆదేశాలను పాటిస్తూ జట్టును నాశనం చేశారని రణతుంగ ఆవేదన వ్యక్తం చేశాడు. లంక క్రికెట్ బోర్డు అధికారులతో జైషాకు సత్సంబంధాలు ఉన్నాయని, వారిని తన గుప్పిట్లో పెట్టుకుని శ్రీలంక టీమ్‌ను భ్రష్ఠుపట్టించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు.

జైషా చాలా పవర్‌ఫుల్‌గా మారాడని, అతని తండ్రి భారత హోంశాఖ మంత్రిగా ఉండడంతో అతని ఆడిందే పాటగా మారిందని విమర్శించాడు.  ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బిసిసిఐ ఇతర దేశాల జట్ల క్రికెట్ బోర్డులను తన గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని రణతుంగా అభిప్రాయపడ్డాడు. జైషా చెప్పినట్టు నడిచిన శ్రీలంక క్రికెటర్లు ప్రపంచ కప్‌లో పేలవమైన ప్రదర్శనతో దేశ పరువును మంటగలిపారని దుయ్యబట్టాడు.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని లంక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. శ్రీలంకకు చెందిన వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో రణతుంగ ఈ ఆరోపణలు చేశాడు. రణతుంగ ఆరోపణలు ప్రపంచ క్రికెట్‌లో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News