Friday, November 22, 2024

పెళ్లికి సిద్ధమవుతున్న రణబీర్, అలియా..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్‌లు తమ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్తున్నారు. డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి వాళ్లు ఎప్పటికప్పుడు పెళ్లి దిశగా అడుగులు వేస్తూనే వచ్చారు. కానీ ఎప్పడూ ఏదో ఒక అవాంతరం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అభిమానులు కూడా డీలాపడుతూనే వచ్చారు. ఈ సారి మాత్రం తమ వైపు నుంచి వాళ్లు అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. రాజస్థాన్‌లోని ‘ఐకానిక్’ ప్యాలెస్‌లో పెళ్లి జరుగనుంది. బంధుమిత్రులను, అత్యంత సన్నిహితులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్లికి హాజరుకానున్నట్టు తెలిసింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నారు. రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఇద్దరికీ కూడా ఎవరి సినిమాలు వారికి ఉన్నాయి. ఇద్దరూ కలిసి ’బ్రహ్మాస్త్ర’ చేస్తున్నారు. ముందుగా ఆ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇద్దరూ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మిగతా ప్రాజెక్టులను మాత్రం కొంత గ్యాప్ తీసుకొని చేస్తారట. అలా ఒక పక్కా ప్లానింగ్‌తో ఈ జంట ముందుకు వెళ్తోంది.

Ranbir Kapoor and Alia Bhatt wedding update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News