న్యూస్ డెస్క్: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఇటీవల తనతో సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని చేతిలోని సెల్‌ఫోన్‌ను చేతిలోకి తీసుకుని విసిరేసిన ఉదంతం వివాదాస్పదమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణబీర్ ప్రవర్తనపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. మీ ఆయనకు మంచీ మర్యాద నేర్పమంటూ అలియా భట్‌కు కొందరు నెటిజన్లు సలహా కూడా ఇస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ఏదో యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో జరిగిన సరదా సంఘటన అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు.
ఒక అభిమాని తన సెల్‌ఫోన్‌లో రణబీర్‌తో కలసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ఫోన్ పదేపదే మొరాయించింది. దీంతో ఫోన్‌ను తన చేతిలోకి తీసుకున్న రణబీర్ ఆ అభిమాని చూస్తుండగానే దాన్ని వెనుకకు విసిరేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే అభిమాని అడిగిన వెంటనే చిరునవ్వుతో రణబీర్ సెల్ఫీ తీసుకోవడాన్ని బట్టి చూస్తే ఇది అభిమానిని ఆటపట్టించడానికి రణబీర్ చేసిన చిలిపి పనిగా కనపడుతోందని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా..ఈ వీడియోను చూసి అసలు నిజమేంటో మీరే కనుక్కోండి.
Shocking 😱 Ranbir Kapoor THROWS Fan's Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— $@M (@SAMTHEBESTEST_) January 27, 2023