Monday, December 23, 2024

కన్నీళ్లతో ఆమె కాళ్లకు నమస్కరించిన హీరో రణబీర్ కపూర్

- Advertisement -
- Advertisement -

ఒక పాట ఆనందడోలికల్లో ఊపేస్తుంది. ఇంకో పాట హృదయాన్ని ద్రవింపచేస్తుంది. మరొక పాట హుషారుగా చిందులేయిస్తుంది. పాటకి ఉన్న శక్తి అది. తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్ 14లో ‘షాన్ దార్ పరివార్’ అనే ప్రత్యేక ఎపిసోడ్ లో యానిమల్ సినిమా హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందాన హల్ చల్ చేశారు. కంటెస్టెంట్లు పాడుతుంటే వారు ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఒక అంధగాయని పాడిన తీరు రణబీర్ కపూర్ ని కంటతడి పెట్టించింది. వెంటనే వేదికపైకి వెళ్లి ఆమె కాళ్లకు నమస్కరించారు. సోనీ టీవీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు నెట్టింట్ల అభిమానులను అలరిస్తోంది.

ఇండియన్ ఐడల్ సీజన్ 14లో అంధ గాయని మేనక పౌదేల్ దూసుకుపోతున్నారు. యానిమల్ జంట హాజరైన రోజు ఆమె రణబీర్ కపూర్ నటించిన ఓ సినిమాలోని ‘అగర్ తుమ్ సాథ్ హో’ అనే పాటను ఆలపించారు. ఆమె అద్భుతంగా ఈ పాట పాడటంతో రణబీర్ కపూర్ రష్మికతో కలసి వేదికపైకి వెళ్లి, ఆమె కాళ్లకు నమస్కరించారు. ‘ఈ పాట పాడిన శ్రేయా ఘోషల్ ను అందరూ దేవత అని అభివర్ణిస్తారు. ఇప్పుడు మరో దేవత మా ముందు సాక్షాత్కరించింది’ అని మేనక పౌదేల్ ను రణబీర్ ప్రశంసలలో ముంచెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News