Sunday, December 22, 2024

వైరల్‌ వీడియో : ఓ ఇంటివాడైన రణ్‌దీప్‌ హుడా

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా తన చిరకాల స్నేహితురాలు, మోడల్ నటి లిన్‌ లైస్రామ్‌ వివాహం చేసుకున్నాడు. మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ లోని ఓ దేవాలయంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. షన్నపుంగ్ రిసార్ట్ నుండి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా ద్వారా రణ్‌దీప్‌ హుడా ఫోటోలను షేర్ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు, పలువురు ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లిన్‌ లైస్రామ్‌తో రణ్‌దీప్‌ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ముచ్చట తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News