Saturday, January 11, 2025

చిత్త వైకల్యంతో బాధపడుతున్న రణ్‌ధీర్ కపూర్!

- Advertisement -
- Advertisement -

Randheer Kapoor
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు రణ్‌ధీర్ కపూర్ చిత్తవైకల్యంతో బాధపడుతున్నారని ఆయన మేనల్లుడు, నటుడు రణ్‌బీర్ కపూర్ తెలిపారు. ‘నా మేనమామ రణ్‌ధీర్ కపూర్ చిత్తవైకల్యం తొలిదశతో బాధపడుతున్నారు. ఆయన సినిమా చూశాక నా దగ్గరికి వచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని మీ నాన్నకు చెప్పు’ అన్నారు. ‘అన్ని మెడికల్ కండిషన్స్ హద్దులను దాటేయగలదు కళ’ అని ఎన్‌డిటివిలో రోహిత్ ఖిల్‌నానికి ఇచ్చిన ఇంటర్వూలో రణ్‌బీర్ కపూర్ తెలిపారు. తన తండ్రి చివరి సినిమా ‘శర్మాజీ నమ్‌కీన్’ గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘మా నాన్న చనిపోయాక సినిమా పూర్తి కాదేమో అనుకున్నాం. విఎఫ్‌ఎక్స్, లేక నేనే ప్రొస్థెటిక్స్ వేసుకుని సినిమాను పూర్తి చేయాలనుకున్నాను. కానీ ఏదీ పనిచేయలేదు. మాకందరికీ అది చాలా కష్ట కాలం. అప్పుడే పరేశ్ రావల్ అడుగుపెట్టి ఓ ఛాలెంజ్‌గా దాన్ని భుజాలకెత్తుకున్నారు.
రణ్‌ధీర్‌కపూర్ నిర్మాత, నటుడు రాజ్ కపూర్ పెద్ద కుమారుడు. ఏడాది కాలంలోనే తన తమ్ముళ్లు రిషికపూర్(67), రాజీవ్ కపూర్(58)లను కోల్పోయారు. రిషికపూర్ ఏప్రిల్ 30న క్యాన్సర్‌తో చనిపోయారు. గత ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో రాజీవ్ కపూర్ చనిపోయారు. వారి కుటుంబం రాజ్ కపూర్‌ను 1988లో కోల్పోయింది. రాజ్‌కపూర్ భార్య కృష్ణా రాజ్‌కపూర్ 2018లో చనిపోయారు. రణ్‌ధీర్ కపూర్ నటించిన మేటి చిత్రాలు ‘కల్ ఆజ్ ఔర్ కల్, జీత్, జవానీ దివానీ, లఫంగే, రామ్‌పూర్ కా లక్ష్మణ్, హాథ్ కీ సఫాయ్’. ఆయన నటి బబితను పెళ్లాడారు. కానీ వారు కొన్ని సంవత్సరాలు విడిపోయారు. వారి పిల్లలే కరిష్మా, కరీనా కపూర్‌లు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News