Wednesday, January 22, 2025

కర్ని ప్రాథమిక పాఠశాలలో డిఆర్‌పిల ఆకస్మిక తనిఖీ

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మండలంలోని కర్ని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెలుగు అభ్యాసన మిత్ర కార్యక్రమంపై జిల్లా రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్ , రాఘవేంద్రలు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్పీలు మాట్లాడుతూ వి ద్యార్థుల్లో ఈ విద్య సంవత్సరానికి సంసిద్దులను చేస్తూ, గుణాత్మక నాణ్యమైన విద్యను సాధించుటకు ముఖ్యంగా సీ గ్రేడ్ విద్యార్థులను తరగతి స్థాయిని చేరుకునే విధంగా వర్క్ షీట్లను ప్రతిరోజు ఖచ్చితంగా పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిర్వహించబడుతున్న ఈ వెలుగు అభ్యాసన మిత్ర 2 నుండి 5 తరగతులకు కా ర్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రతి ఉపాద్యాయుడు మొ దటి 45 నిమిషాలు టీఎస్పీ ప్రాసెస్ టీఎల్‌పీ తరగతి బోధనకు , తదుపరి 45 నిమిషాలు ప్రతి విద్యార్థి వర్క్ బుక్‌లోని , వర్క్ షీట్ను పూర్తి చేయకుండా తప్పనిసరిగా నిర్ణయించాలలని సూ చించారు. ఆంగ్ల అభ్యసన కార్యక్రమం జాలి ఫోనిక్స్‌ను తప్ప నిసరిగా అమలు అయ్యేలా ప్రధానోపాద్యాయులు ప్రత్యేక చొ రవ తీసుకోవాలని సూచించారు.

లైబ్రరీ పీరియడ్ ఖచ్చితంగా అమలు అయ్యేలా , విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే వి ధంగా తగు సూచనలు చేశారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ , స్టాఫ్ అందరికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స మావేశంలో ప్రధానోపాద్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు ఆశోక్, శ్వేత, రమ్య, తిరుమలలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News