Saturday, December 21, 2024

అభ్యర్థుల సమక్షంలో ర్యాండమైజేషన్: ఎన్నికల అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: నియోజకవర్గ స్థాయి పరిశీలకులు అభ్యర్థుల సమక్షంలో 2వ ఈవిఎంల ర్యాండమైజేషన్ నిర్వహించబడుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అభ్యర్థులకు నియోజకవర్గ స్థాయిల్లో సువిధ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 22,254 అనుమతులు ఇచ్చినట్లు, సి-విజిల్ ద్వారా 5183 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి 1950 హెల్ప్‌లైన్‌కు 1987 కాల్స్ వచ్చాయని, ఎన్‌జిఆర్‌ఎస్‌లో 20,670 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఇందులో 20301 పరిష్కరించినట్లు జిల్లా కాల్ సెంటర్ ద్వారా 4673 ఫిర్యాదులు వస్తే 4543 పరిష్కరించామన్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర, కేంద్రంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రూ.603 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో నగదు వాటా రూ.214 కోట్లు, ఇప్పటివరకు మొత్తం రూ.96 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకోగా, గత 24 గంటల్లో రూ.9.42 కోట్ల విలువైన మద్యం పట్టుబడినట్లు చెప్పారు. ఇప్పటివరకు మొత్తం రూ.34 కోట్ల విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్ స్వాధీనం చేసుకోగా, గత 24 గంటల్లో రూ.53 లక్షల విలువైన డ్రగ్స్/నార్కోటిక్స్ పట్టివేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.179 కోట్ల విలువైన బంగారం, ఇతర విలువైన లోహాలు, రూ.78 కోట్ల విలువైన బియ్యం, చీరలు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత 24 గంటల్లో రూ. 27 లక్షల విలువైన ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి వచ్చే అధికారిక వాహనాలకు కూడా ఎన్నికల నిబంధన సమానంగా వర్తిస్తాయన్నారు. అధికారిక పనుల ముసుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో సహా అధికారులకు చెందిన వాహనాలను ప్రచారం కోసం ,ఎన్నికలకు సంబంధించిన పర్యటనలకు ఉపయోగించడం పూర్తిగా నిషేదమన్నారు. భద్రతా అవసరాలు చట్టబద్ధమైన నిబంధనల ద్వారా నిర్వహించబడే రాజకీయ వ్యక్తులకు మినహాయింపు ఉంటుందని అభ్యర్థి ప్రచారం కోసం ఉపయోగించే ప్రతి వాహనానికి అనుమతి పొందాలి లేకుంటే సీజ్ చేస్తామన్నారు.

పార్టీల వారీగా ఆమోదించబడిన స్టార్ క్యాంపెయినర్ల సంఖ్య :
1. బహుజన్ సమాజ్ పార్టీ: 40
2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్):36
3. భారతీయ జనతా పార్టీ: 40
4. భారత జాతీయ కాంగ్రెస్ : 40
5. భారత రాష్ట్ర సమితి : 39
6. ప్రగతిశీల సమాజ్ పార్టీ:  15
7. బహుజన ముక్తి పార్టీ:  11
8. లోక్ తాంత్రిక్ జనతా పార్టీ : 20
9. లోక్ జనశక్తి పార్టీ: 20
10. బహుజన భారత్ పార్టీ:  12
11. నేషనల్ యూత్ పార్టీ :  12
12. జనసేన పార్టీ: 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News