Thursday, January 23, 2025

‘రంగరంగ వైభవంగా’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Ranga Ranga vaibhavanga Teaser Released

‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ “మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేశాను. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది”అని అన్నారు. హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా కూడా నచ్చుతుంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ “మా సినిమాలో వైష్ణవ్ తేజ్ కొత్తగా కనిపిస్తారు. ఆయన ఎనర్జీ నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఆయన ఎనర్జీయే మా రంగ రంగ వైభవంగా సినిమా. ఈ సినిమాలో కేతికా శర్మ అద్భుతంగా నటించింది”అని తెలిపారు. హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ “మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నవీన్‌చంద్రతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Ranga Ranga vaibhavanga Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News