Friday, December 27, 2024

యువతిపై అత్యాచారయత్నం… ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై ఆ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరొక వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్ లో నివాసం ఉంటూ మియాపూర్ లోని ఓ రియలేస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్ లో ట్రైనీగా జాయిన్ అయింది. అయితే అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ ను సందర్శించాలని ఆమెను కారులో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెపై వారు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి యువతి తప్పించుకొని గత రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి, అక్కడి నుంచి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అత్యాచారం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సిఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News