Wednesday, January 22, 2025

పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు రేసింగ్… ఆరు పల్టీలు కొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం తెల్లవారుజామున  కారు రేసింగ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చి పల్టీలు కొట్టింది.  పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను మళ్లించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కారు నుజ్జు నుజ్జుగా మారింది. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు అనే సమాచారాన్ని పోలీసులు స్వీకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News