Friday, December 20, 2024

‘దేవుడా..ఎంత పని చేశావయ్యా’

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ముహూర్తం ఖారారు కావడంతో సామాన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కందకూరు మండలంలోని దెబ్బడగూడ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగర్ కర్నూల్‌కు చెందిన తూంకుంట శంకర్(27) హైదరాబాద్‌లోని ఓ న్యూస్ ఛానల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. శంకర్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికి యువతి తల్లిదండ్రులు ప్రేమపెళ్లికి నిరాకరించారు. మార్చి 20న ప్రేమ పెళ్లి చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి సామాన్ల కోసం శంకర్ తన ప్రేయసితో కలిసి బైక్‌పై హైదరాబాద్ కు వచ్చాడు. సామాన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేయసిని బస్సు ఎక్కించి అతడు బైక్‌పై బయలు దేరాడు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై దెబ్బడగూడ సమీపంలోకి రాగానే అతడి బైక్‌ను కారు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. బైక్ నంబర్‌ను బస్సులో నుంచి ప్రేయసి గమనించి కిందక దిగి ప్రియుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రియుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలి తన ప్రియుడి మృతదేహాన్ని చూసి కన్నీంటి పర్యంతమయ్యారు. కలిసి బతుకుదామనుకున్నాం.. విడదీసి ఎంత పని చేశావు దేవుడా? అంటూ ప్రియురాలు శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News