- Advertisement -
హైదరాబాద్: కారులో లిఫ్ట్ ఇచ్చి విదేశీ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మీర్‌పేటలో జర్మనీ దేశానికి చెందిన యువతి నడుకుంటూ వెళ్తుండగా ఆమెపై కొందరు యువకులు కన్నేశారు. మందమల్లమ్మ సెంటర్‌లో లిఫ్ట్ ఇస్తామని యువతిని నమ్మించారు. కొంచెం దూరం తీసుకెళ్లిన తరువాత కారులో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. సదరు యువతి పహాఢీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేస నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -