Monday, December 23, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో అగ్నిప్రమాదం…..

- Advertisement -
- Advertisement -

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షాట్ సర్కూట్‌తో మంటలు అంటుకున్నాయా? లేక ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News