హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ ను కారు ఢీ కొట్టి అనంతరం పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పైకి దూసుకువచ్చి ఎదురుగా వస్తున్న టాటా సఫారి కారును ఢీకొట్టింది. క్యాబ్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడడడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓవర్ స్పీడింగ్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు నార్సింగి వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు తమ రూట్ లో వెళుతున్న టాటా సఫారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జు నుజ్జుగా మారాయి. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి కి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు.